హెచ్ 1బీ తిరస్కరణ రేటు 30శాతం
ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికంలో హెచ్ 1బీ వీసా తిరస్కరణ రేటు 30 శాతంగా నమోదయింది. తిరస్కరణ రేటు 2015లో 6 శాతం, 2017లో 13 శాతం ఉండగా అధ్యక్షుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది భారీగా పెరిగింది. అమెరికా టెక్నాలజీ సంస్థల కంటే థర్డ్‌పార్టీ లోకేషన్స్‌లో ఐటీ సర్వీసుల కంపెనీలు, కన్సల్టెన్సీలు దరఖాస్తులు ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయి. గత కొన్ని త్రైమాసికాలుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తిరస్కరణ రేటు ఎక్కువగా ఉన్న టాప్ 25 కంపెనీల్లో కాగ్నిజెంట్ (60 శాతం), ఇన్ఫోసిస్ (59 శాతం), డెలాయిట్ (40 శాతం) జాబితాలో ఉన్నాయి. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డేటా ఆధారంగా నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ఈ మేరకు విశ్లేషించింది.













