హెచ్1బి వీసా అప్లికేషన్లు ఫుల్
సాంకేతిక రంగంలో పనిచేసేవారికోసం అమెరికా ఏటా ఇచ్చే హెచ్ 1 బి వీసా అప్లికేషన్లు ఇప్పటికే పరిమితికి మించి వచ్చాయని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్పారు. ఏటా 85వేలమందికి మాత్రమే అమెరికా హెచ్1 బి వీసాలను ఇస్తోంది. దీనిని కూడా ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తరువాత బాగా తగ్గిస్తోంది. మార్పులను తీసుకువచ్చింది. ప్రస్తుతం ముందుగా హెచ్1బి వీసా కావాలనుకున్నవారు రిజిస్ట్రేషన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 10 డాలర్లు కట్టి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ పేర్లను పరిశీలించిన తరువాత ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిమితికి మించి ఉంటే లాటరీ తీస్తారు. లాటరీ తీసిన తరువాత సెలెక్ట్ అయిన వాళ్ళకు హెచ్ 1బి వీసాకు వాళ్ళు అప్లై చేసుకోవాలి. 90 రోజుల్లోపు వాళ్ళు హెచ్1బి వీసాకు పిటీషన్ పెట్టుకోవాలి. ఈ మార్పుల వల్ల అనవసరమైన ఖర్చు చాలామందికి తగ్గింది. ఎంపికైనవారు మాత్రమే అప్లికేషన్లు పెట్టుకోవడం వల్ల ఖర్చులు, పేపర్ వర్క్ కలిసివస్తోంది. మార్చి 31లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్నవాళ్ళలో లాటరీ ద్వారా ఎంపికైన వాళ్ళు ఏప్రిల్ 1 నుంచి హెచ్1బి వీసాకు అప్లై చేసుకోవాలి.













