హెచ్-1బీ వీసా కొత్త నిబంధనలు
వృతి నిపుణులకు అమెరికా ఇచ్చే హెచ్-1బీ వీసాల కొత్త నిబంధనల మేరకు దరఖాస్తుల పక్రియ ప్రారంభమైంది. ఈ నెల 1న ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తుల పర్వం 20వ తేదీతో ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్న కొత్త నిబంధనల్లో దరఖాస్తుదారులకు చాలా వెసులుబాట్లు కల్పించారు. ఈ సారి హెచ్-1బీ వీసా ఎలక్ట్రానిక్ పద్ధతిలో దరఖాస్తుకు వీలు కల్పిచండంతో కంపెనీల ఖర్చు తగ్గనుంది. ఎంపికైన అభ్యర్థులు 90 రోజుల్లోగా హెచ్-1బీ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. 65 వేల హెచ్-1బీ వీసాలను లాటరీ పద్ధతిలో ఇస్తుంది. అదే విధంగా అమెరికాలోనే మాస్టర్స్ పూర్తిచేసిన వారికి 20 వేల హెచ్-1బీ వీసాలు అందజేస్తుంది.













