H-1B వీసా సాకు చూపి శ్రమ దోపిడీ… యూఎస్ కంపెనీపై తెలుగు టెకీ దావా..
H-1B వీసాపై ట్రంప్ ఆంక్షలు.. అక్కడి టెకీలను బానిసలను చేస్తున్నాయా…? ఎదురు మాట్లాడినా, హక్కులకోసం పోరాడినా.. మీ వీసా రద్దు చేస్తామని బెదిరిస్తున్నాయా…? గత్యంతరం లేని పరిస్థితుల్లో శ్రమదోపిడీకి గురవుతోందని తెలిసినా.. టెకీలు నిస్సహాయంగా మారిపోతున్నారా..? ఇలాంటి పరిస్థితులను ఏమనాలి..? అందులోనూ ప్రజాస్వామ్యానికి నిలువుటద్దంగా భావించే అమెరికాలో ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి.. అమెరికా అధికార యంత్రాంగం ఏమి చేస్తోంది..?
ఒక తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ….తన యజమాని సిరి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ (సిరిసాఫ్ట్), దాని భారతీయ సంతతికి చెందిన CEO పవన్ టాటాపై శ్రమ దోపిడీ, శాలరీ ఎగ్గొట్టడం, కుల ఆధారిత వివక్షను ఆరోపిస్తూ యునైటెడ్ స్టేట్స్లో దావా వేశాడు. కఠినమైన, చట్టవిరుద్ధమైన కండిషన్లలో పనిచేయాలని బలవంతం చేసిన సిరి కంపెనీ.. దీనికి గానూ గతంలో గ్రీన్ కార్డు వచ్చేలా చేస్తామని హామీ సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు గ్రీన్ కార్డు కాదు కదా.. ఉన్న వీసాను రద్దు చేస్తామని బెదిరించి గత ఆరునెలలుగా పనిచేయించుకుంటున్నట్లు సమాచారం. అంతే కాదు.. కంపెనీ మారేందుకు కూడా అంగీకరించనట్లు తెలుస్తోంది. ఓవేళ దీనికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేస్తే.. అమెరికా నుంచి నేరుగా ఇండియాకు పంపిస్తామని హెచ్చరించినట్లు సదరు బాధితుడు ఫిర్యాదులో తెలిపాడు.
కంపెనీ తనకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వని పరిస్థితుల్లో.. ఆరు నెలలుగా అస్థిరమైన చెల్లింపులను భరించానని, అద్దె మరియు వైద్య సంరక్షణ వంటి ప్రాథమిక ఖర్చులను భరించలేకపోయానని వల్లభనేని పేర్కొన్నాడు.
టెక్ ఉద్యోగి ,అతని భార్య తీవ్రమైన ఆర్థిక మరియు మానసిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని, ఆరోగ్య బీమాలో లోపం కారణంగా గాయానికి వైద్య చికిత్స లేకుండా పోయిందని దావా తెలిపింది.
కేసు వేయడంలో సాయం చేసిన లేబర్ ట్రాఫికింగ్ నిపుణుడు జే పామర్, పరిస్థితిని “భారతీయ కార్మికులకు స్క్విడ్ గేమ్”గా అభివర్ణించారు, “ఇది చాలా, చాలా దోపిడీ సంస్కృతి. భారతీయ CEOలు తరచుగా US పని ప్రదేశాలలోకి కులవివక్షను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
వల్లభనేని దావాతో .. ఇండస్ట్రీలో జరుగుతున్న దోపిడీ ఘటనలు .. ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి.
ఈ ఆరోపణలపై సిరి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
వల్లభనేని అమెరికా ప్రయాణం… 2015లో F-1 విద్యార్థి వీసాపై ప్రారంభమైంది. అతను మొదట న్యూజెర్సీలో E-కంటెంట్ కోసం … వివిధ రకాల వాతావరణాల్లో పనిచేశాడు, తరువాత 2018లో సిరిసాఫ్ట్లో చేరాడు, ఆకంపెనీ…అతనికి H-1B స్పాన్సర్షిప్ను అందించింది







