అమెరికాలోనే హెచ్1బీ వీసాల రెన్యువల్
అమెరికాలో పనిచేస్తున్న విదేశీ వృత్తి నిపుణుల హెచ్-1బి వీసాలను అమెరికాలోనే పునరుద్ధరించడానికి మార్గం సుగమమైంది. దీనికి అధ్యక్ష భవనానికి చెందిన నియంత్రణ సంస్థ ఓఐఆర్ఏ ఈ నెల 15న పచ్చజెండా ఊపింది. విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో పని చేయడానికి ఇచ్చే అనుమతి పత్రాన్ని హెచ్-1బీ వీసా అంటారు. సాధారణంగా వీటి గడువు మూడేళ్లలో తీరిపోతుంది. దాన్ని మరో మూడేళ్లు పొడిగించుకోవడానికి వీసా దారులు అమెరికా నుంచి స్వదేశం తిరిగిరావడమే లేక మరేదైనా దేశానికి వెళ్లి పునరుద్ధరించుకోవడమో చేయాలి. ఈ ఏడాది జూన్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు హెచ్-1బి వీసాలను అమెరికాలోనే పునరుద్ధరిస్తామని బైడెన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మొదట 20,000 వీసాలు పునరుద్ధరించడానికి పైలట్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఈ పైలట్ కార్యక్రమంలో భారతీయులే ఎక్కువగా లబ్ధి పొందుతారని అమెరికా అధికారులు వివరించారు.













