హెచ్ 1 బీ వీసాల రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) 2025 సంవత్సరానికి హెచ్ 1బీ వీసా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. న్యూమరికల్ అలకేషన్స్ (హెచ్ 1బీ క్యాప్) అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపు ( మాస్టర్ క్యాప్) కూడా దీంతో పాటు ప్రారంభించారు. 2025 కోసం తగినన్ని రిజిస్ట్రేషన్లు వచ్చాయని యూఎస్సీఐఎస్ తెలిపింది. హెచ్ 1బీ క్యాప్‌ను చేరుకునేందుకు ర్యాండమ్‌గా అప్లికేషన్ల ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇలా ఎంపికైన లబ్దిదారులకు హెచ్ఈబీ క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్ చేయడానికి ఎంపికైన అర్హులందరికీ తెలిపినట్లు యూఎస్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ తెలిపింది. రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్ ఎకౌంట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చని తెలిపింది. కొత్త ఫీజుల వివరాలను 2024 జనవరి 31న వెల్లడిరచినట్లు తెలిపింది. దీని ప్రకారమే ఎంపికైన వారు చెల్లించాలని కోరింది.







