వాషింగ్టన్‌లో జీడబ్ల్యూటీసీఎస్ పిక్నిక్

అగ్రరాజ్యం అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో తెలుగు కమ్యూనిటీ పిక్నిక్ జరుగుతోంది. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యూటీసీఎస్) ఆధ్వర్యంలో ఈ పిక్నిక్ జరుగుతోంది. ఆదివారం నాడు లేక్ ఫైర్‌ఫాక్స్ పార్క్ వేదికగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని జీడబ్ల్యూటీసీఎస్ ప్రెసిడెంట్ కృష్ణ లామ్ తెలిపారు. దీనిలో స్థానిక గాయకులు తమ పాటలతో అందర్నీ అలరిస్తారు. అలాగే భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు కూడా జరుపుకుంటారు. చిన్నారులకు ఆటపాటలు, మంచి భోజనం తర్వాత సాయంత్రం కేక్ కటింగ్ ఉంటుంది.