ఉల్లాసంగా జిడబ్ల్యుటీసిఎస్ పిక్నిక్
గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ పిక్నిక్ ఈవెంట్‌ను ఇటీవల నిర్వహించారు. కొద్దిమంది ఫ్యామిలీతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైందని అసోసియేషన్ అధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు తెలిపారు. తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, నరేన్ కొడాలి, తాళ్ళూరు ఫణి, ప్రవీణ్ కొండక, విజయ్ గుడిసేవ, చంద్ర మాలావతు, భానుమాగులూరి, ఫణి తాళ్ళూరి, కృష్ణ లాం తదితరులు అందించిన సహకారంతో కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించామని ఆమె చెప్పారు. ఎన్ఆర్సి, రామ్‌చౌదరి, అనిల్ చౌదరి ఉప్పలపాటి ఈ సందర్భంగా రాయలసీమ సంగటి, పూరీ స్వీట్లు తయారు చేశారు. జిడబ్ల్యుటీసిఎస్ మాజీ అధ్యక్షురాలు జయప్రద, జక్కంపూడి మద్దతు ఇచ్చారు. కోవిడ్ సమయంలో చాలా చక్కగా పిక్నిక్ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల పలువురు సాయిసుధ పాలడుగును అభినందించారు.













