యోగాశ్రమంలో పరమ గురువు మాస్టర్ సి. వి. వి.
గురు దర్శనం
సికింద్రాబాద్ – తిరుమలగిరి లోని మాస్టర్ యోగాశ్రమంలో
పరమ గురువు మాస్టర్ సి. వి. వి.
యోగ సాధన ఎలా చేయాలనో, ఎందుకు చేయాలనో ప్రశ్నలకి చిక్కనైన సమాధానాలు చెప్పే పుస్తకం. శ్రీ శార్వరి గారు యోగ సాహిత్యంలో శతాధిక గ్రంధకర్త, సికిందరాబాద్ తిరుమలగిరిలో మాస్టర్ సి. వి. వి. యోగాశ్రమ సంస్థాపకులు. దాదాపు అర్ధశతాబ్దం అకుంఠిత యోగ సాధన చేసి, పరమ గురువర్యులుగా ఎందిరికో దిశానిర్దేశం చేసిన అపారమైన అనుభవంతో శ్రీ శార్వరి గారు రచించిన అద్భుతమైన గ్రంధం “గురు దర్శనం”. ఇందులో సృజించిన కొన్ని విషయాలు:
నీవుహృదయంలో ఒక గురువును నిలుపుకో. ధ్యానం సాగించు. నిశ్చింతగా, నిస్సందేహంగా ఆయన చెప్పినట్లు నడుచుకో, ప్రశ్నించవద్దు. గురువు పేరే సాధనకు మహామంత్రం. గురువుపైఅచంచల భక్తి ఉంటే అదే తపస్సు. గురువును హృదయంలో నిలుపుకోవడమే ధ్యానం.
యోగానికి, సాధనకు, తపస్సుకు చిట్కాలు, దొడ్డిదోవలు ఉండవు. ఇది హృదయంతో వ్యవహారం. ఎవరు ఒక్కసారిగా జ్ఞానులైపోరు, జ్ఞాననేత్రం తెరచుకోదు. ఎంతో సాధన చేస్తేగాని అంతఃదృష్టి ఏర్పడదు.
చక్కని క్రమశిక్షణ పాటిస్తే యోగం సులభమే. క్రమశిక్షణ, నిబంధనల వల్ల గురువుకి ఒరిగేదేమి ఉండదు. సాధకులకే ప్రయోజనం. క్రమశిక్షణ వల్ల ఆలోచనలపై నిబద్ధత ఏర్పడుతుంది అప్పుడు సాధన సులభమవుతుంది.
జీవితం అంటే ఏమిటి? ఆనందాలు, దుఃఖాలు, సుఖాలు, కష్టాలు, ద్వేషాలు, భయాలు, కోరికలు, ఆందోళనలు… వీటి కలయిక జీవితం. వీటిని ఇష్టాంగా వదులుకునేవాడు జ్ఞాని. వీటిస్థానంలో శాశ్వతమైనఆనందాన్ని నింపుకొనేవాడు తపస్వి. శూన్యాన్ని చైతన్యంతో పూరించేవాడు యోగి.
భౌతిక శరీరంలో ఉండి మీకు మొదట యోగోపదేసం చేసేది “గురువు”. నిన్ను జ్ఞాన సీమలకు చేర్చేది “సద్గురువు”. సూక్ష్మ శరీరాలతో ఉంది ఆధ్యాత్మిక రంగంలో సాధకులను పర్యవేక్షించేది” మహాగురువులు”. వారు మృత్యుంజయులు. బ్రహ్మసిద్ధిని పొందినవారు “పరమ గురువులు”. వారు పరబ్రహ్మతో సములు. వారు విశ్వఋషులు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం-అనేమూడు లోకాలలో సంచారం చేయగలరు. అవసరమైనప్పుడు దివ్యదర్శం యివ్వగలరు పరమ గురువులు.
కోటిమందిలోఆధ్యాత్మికత వైపు దృష్టి పెట్టే వారువేయిమంది ఉండరు. వేయి మందిలో సాధన, జిజ్ఞాస కలవారు ఏ పదిమందో ఉంటారు. ఆ పదిమంది సాధకుల్లో గురువుకాగల వ్యక్తి ఏ ఒక్కరో ఉండొచ్చు. నూరుగురు గురువుల్లో సద్గురువు అయ్యే ప్రజ్ఞ ఒకరికి ఉండవచ్చు. నూరు మంది సద్గురువులలో మహా గురువులయ్యే వారు పదిమంది మిగులుతారు. పదిమంది మహా గురువుల్లో పరమపద సోపానాలు అధిరోహించి, పరమ గురువు అయ్యేవారు ఒక్కరుంటారు. అలాంటి పరమ గురువు, పరమయోగి, పరబ్రహ్మంశ స్వరూపులు మాస్టర్ సి. వి. వి.
మాస్టర్ యోగం అంటే ఒక మతంకాదు. ఈ యోగం ఏమతానికి చెందింది కాదు. అన్ని మాటలకూ అతీతమైంది. ఇది కేవలం ఆత్మపరమైనయోగసాధన ప్రక్రియ. ప్రాపంచిక విషయాలపట్లవైముఖ్యం, వైరాగ్యం పనికిరాదు. సహజంగా కుటుంబ జీవితం గడపటం అవసరం. భార్యాభర్తలు కలిసి చేస్తే యోగం మహత్తర ఫలితాలనిస్తుంది.
మరిన్నివివరాలకు: డాక్టర్ వాసిలి వసంత కుమార్, మాస్టర్ యోగాశ్రమం, 89 Krishna Enclave, Military Dairy Farm Road, Trimulgherry, Secunderabad – 500015 drvaasili@yahoo.co.in Phone: 9393933946
For copies in USA:
Dr. Ramana Vasili,
Spiritual Foundation, Inc.
7062 S. Beringer Drive
Cordova, Tennessee 38018
ramanavvasili@hotmail.com
901-387-9646













