GTA: జిటిఎ తెలంగాణ శాఖల విస్తరణ
అమెరికాలో తెలంగాణవాసుల కోసం ఏర్పడిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) అమెరికాలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలంగాణ సంస్కృతి విస్తరణకు దోహదపడుతోంది. తెలంగాణ కమ్యూనిటీకి అవసరమైన సేవ, సహాయ కార్యక్రమాలను కూడా చేస్తోంది. ఇటీవల బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించి మంచి ఇమేజ్ తెచ్చుకున్న గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా జిటిఎ ఛాప్టర్ లను జిల్లాల వారీగా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా డిసెంబర్ 27,28 తేదీల్లో తెలంగాణ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఛాప్టర్ ను ప్రారంభించింది. హైదరాబాద్ లోని గండిపేటలో ఉన్న అక్షయ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఛాప్టర్ కు మంజులరావు జూపల్లి అడ్వయిజరీ చైర్ గా, సోమారపు లావణ్య కో చైర్‌గా, గుజ్జుల కుమార్ అడ్వయిజరీ కో చైర్ గా, వేల్పూరి సంపత్ రావు ప్రెసిడెంట్ గా ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ గా బొద్దుల లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా డా. వూట్ల అశోక్ కుమార్ ఉన్నారు. నాయకులుగా తోడుపునూరి శ్రీనివాస్, కె. అజయ్ కుమార్, మేడగోని వెంకటేశ్, గడ్డం తిరుపతి రెడ్డి, డి. వెంకట సాంబమూర్తి, లహరి, జి. మురళీధర్, అదెపు సతీష్, పతాకుల అనిల్, నార్ల ప్రసాద్, గుంత వినోద్, డా. శరణ్య, జూపల్లి తిరుమలరావు, నల్లవెల్లి శంకర్, డా. పొల్సాని శ్రీప్రియ, పనస మల్లయ్య, శ్రీపతి ఉమామహేశ్, దుగ్యాల శ్రీధర్ రావు, కంకటి శ్రీనివాస్, చంద్రగిరి వంశీరావు, గన్నబోయిన సాగర్ తదితరులు ఉన్నారు.
కరీంనగర్ జిటిఎ ఇండియా ఛాప్టర్ నాయకులు ఎస్ రామకృష్ణారెడ్డి, మూల విజయా రెడ్డి, వి. వెంకట నారాయణ, దొంకెన రవీందర్, జూపాక కృష్ణమూర్తి, జి. సునీతారవి, జి. వెంకట్రమణారెడ్డి, గుజ్జా విజయరావు, కూనరపు రేణుకాదేవి, జె అంజిత్‌రావు, కె. చొక్కారెడ్డి, ఎస్. వెంకటేష్, బండ్ల లింగారావు, గాదె మాధవి, కె. రాజేందర్ ఉన్నారు.






