జీటీఏ ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ, దసరా సంబరాలు

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ, దసరా సంబరాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. అక్టోబర్ 22, ఆదివారం నాడు వర్జీనియాలోని బ్రాడ్ రన్ హైస్కూల్ వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగే ఈ వేడుకల్లో ఉచితంగా భోజనం కూడా ఉంటుంది. ఈ వేడుకల్లో భాగంగా ఉత్తమ బతుకమ్మలకు, చిన్నారులకు బహుమతులు కూడా అందించనున్నారు. స్థానికంగా నివసించే తెలంగాణ బిడ్డలంతా వచ్చి ఈ వేడుకలను విజయవంతం చేయాలని జీటీఏ నిర్వాహకులు కోరుతున్నారు.