గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ సంబరాలు

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) అట్లాంటా ఛాప్టర్ ఆధ్వర్యంలో ‘మెగా బతుకమ్మ- దసరా సంబరాలు’ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబరు 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి 9 గంటల వరకు సౌత్ ఫార్‌సైత్ హైస్కూల్ ఎరీనా వేదికగా ఈ బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ప్రముఖ గాయకుల లైవ్ పెర్ఫామెన్స్, స్థానిక కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, జమ్మిపూజ, వివిధ పోటీలు, పసందైన విందు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకునేవారు http://bit.ly/GTA-ATL-MEGA-BATHUKAMMA-2023 లింకులో రిజిస్టర్ చేసుకోవచ్చు.