GTA: అంబరాన్నంటిన జిటిఎ సద్దుల బతుకమ్మ – దసరా సంబరాలు

వాషింగ్టన్ డీసీ వేడుకలకు 5000మందికిపైగా హాజరు
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్(GTA) వాషింగ్టన్ డీసీ వారు సెప్టెంబర్ 28 ఆదివారం రోజున బ్రాడ్ రన్ హైస్కూల్ లో నిర్వహించిన మూడవ సద్దుల బతుకమ్మ`దసరా సంబరాలు నభూతోనభవిష్యత్తు అనేలా ఇంతకుముందు జరిగిన వాషింగ్టన్ డీసీ బతుకమ్మ చరిత్రను తిరగరాస్తూ దాదాపు 5000మందికిపైగా వచ్చిన వారితో సందడిగా సాగింది. జిటిఎ మహిళా వనిత టీం, సంస్థ చైర్మన్, గ్లోబల్ ఉపాధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు,సెక్రెటరి, జాయింట్ సెక్రెటరి, ఎగ్జిక్యూటివ్ కమిటి,కమిటి చైర్స్, కో-చైర్స్ కలిసి అమెరికా, భారత్, తెలంగాణ జాతీయ గీతాలతో, అమరవీరులకు ఒక నిమిషం పాటు మౌనం పాటించి మరియు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసారి ప్రత్యేకంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్(జిటిఎ) వాషింగ్టన్ డీసీ వారు నిర్వహించిన మూడవ సద్దుల బతుకమ్మ ` దసరా సంబరాల్లో విశిష్ట వ్యక్తి, మెలోడీ క్వీన్ ‘పద్మ భూషణ్’ గ్రహీత ప్రముఖ గాయని, కేయస్ చిత్ర గారు పాల్గొనటం జరిగింది.
జిటిఎ సంస్థ వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు రాము ముండ్రాతి మరియు వాషింగ్టన్ డీసీ కోర్ కమిటీ టీం సారధ్యంలో మెగా జిటిఎ డీసీ బతుకమ్మ కార్యక్రమంలో సుమారు 200 పైగా బతుకమ్మలను అందంగా అలంకరించి తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకలకు మహిళలు,వర్జీనియా రాజకీయ నాయకులు, వివిధ తెలుగు సంస్థ అధ్యక్షులు, నిర్వాహాకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డోలు డప్పులతో మరియు విన్యాసాలతో బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకరావటం జరిగింది. బెస్ట్ బతుకమ్మ లకు తనిష్క్ యుఎస్‌ఎ నుంచి బంగారు బహుమతులు మరియు పట్టు చీరలు అందించారు.
ఈ వేడుకల్లో భాగంగా మహిళలు కోలాటం జానపద నృత్యాలు, డ్యాన్స్ ,గౌరి మరియు జమ్మి పూజ నిర్వహించారు. స్థానిక రెస్టారెంట్ కంట్రీ ఓవెన్ అధినేత శ్రవణ్ పాడూరు సారధ్యంలో వర్జీనియాలో వున్న ప్రముఖ రెస్టారెంట్స్ కంట్రీ ఓవెన్,శాఫ్న్ర్- క్లేపాట్, ఉడ్ల్యాండ్స్,పేస్ట్రి కార్నర్ ,ట్రై-స్టేట్, త్రివేణి, ఔరా, అల్గోరిథమ్స్, పారడైజ్ ఇండియన్ కుసిన్, ఆద్య ఫుడ్స్, కాకతీయ కిచెన్ మరియు పటేల్ బ్రదర్స్ మేము కూడా తమ వంతు సహాయంగా పాల్గోని ఉదయం 12:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు 5000 పై చిలుకు అతిథులకు ఉచితంగా పసందైన భోజన కార్యక్రమం నిర్వహించారు.
జయ తేలుకుంట్ల, ప్రత్యూష నరపరాజు, మాధురి గట్టుపల్లి, లక్ష్మి బుయ్యాని, సంకీర్త ముక్క, మీన కలికోట,సంధ్య ఈగల,అనూష గుండ,గీత తోట, స్వరూప సింగిరేసు, చిన్ని, కళ కొత్త , రూప రాణి అమనగండ్ల, జనేత కంచర్ల, జలజ ముద్దసాని, అనుపమ దోమ, శ్రుతి సూదిని, రష్మి కట్పల్లి, షర్మిల మేకల,సంధ్య కే,సుస్మిత జువ్వాడి, స్వప్న కరివేడ, ప్రీతి రాచర్ల, రaాన్సి జోగు, రేవతి ముంద్రాతి, స్వర్ణ కమల్ ఈవెంట్స్ స్వర్ణ కుసుమ, డిజె దీప్తి , దివ్య అవ్వారు, శ్వేత వంగల, సమత తెల్లపెల్లి, మరియు ఇతర మహిళలు పాల్గొన్నారు. సుజిత దర్శకత్వం లో మహిళలు పాల్గొని టీజర్ షూట్ చేయడం జరిగింది.
గ్లోబల్ తెలంగాణా అసోసియేషన్ (జిటిఎ) సంస్థ వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు రాము ముండ్రాతి, చైర్మన్ విశ్వేశ్వర కలువల,ఉపాధ్యక్షులు శ్రవణ్ పాడూరు,వాషింగ్టన్ డీసీ పూర్వ అధ్యక్షులు తిరుమల్ మునుకుంట్ల, ట్రెజరర్ సుధీర్ ముద్దసాని, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమరేంద్ర నంది మాట్లాడుతు తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు అధిక సంఖ్యలో పాల్గోని ఈ వేడుకలను ఘనవిజయం చేయడంలో తోడ్పడిన వాలంటీర్స్, రెస్టారెంట్స్, బిజినెస్ ఎగ్జిబిట్ స్టాల్స్, స్పాన్సర్స్, పోలీస్ సిబ్బంది, స్కూల్ సిబ్బంది, ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు, యూ ట్యూబ్ వీడియోల ద్వారా ప్రజాదరణ పొందిన గంగవ్వ గారు, సినీ నటి అనన్య నాగల్ల గారికి అందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు చెప్పారు. వర్జీనియా రాజకీయ నాయకులు కాంగ్రెస్‌మ్యాన్ సుహాస్ సుబ్రహ్మణ్యం, విఎ స్టేట్ సెనెట్ కణ్ణన్ శ్రీనివాసన్, డెలిగేట్ జెజె సింగ్, సెక్రటరీ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ ఫర్ కామన్వెల్త్ ఆఫ్ వర్జీనియా నాయకులు జున్ పబ్లో తదితరులు ఇందులో పాల్గొన్నారు.
గ్లోబల్ తెలంగాణా అసోసియేషన్ (జిటిఎ) సంస్థ చైర్మన్ విశ్వేశ్వర కలువల, ఉపాధ్యక్షులు శ్రవణ్ పాడూరు, వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు రాము ముండ్రాతి, పూర్వ అధ్యక్షులు తిరుమల్ మునుకుంట్ల, ట్రెజరర్ సుధీర్ ముద్దసాని, స్టాండిరగ్ కమిటి చైర్ శ్రీకాంత్ పొట్టిగారి మరియు ఇంటెర్నేషనల్ కో-ఆర్డినేటర్ నర్సి దోమ, ఉపాధ్యక్షులు కోట్య బానోత్ , రఘు పాల్రెడ్డి, అమర్ అతికం, క్రిష్ణకాంత్ కుచలకంటి, వాషింగ్టన్ డీసీ బతుకమ్మ కోర్ టీం వంశి సింగిరెడ్డి, ప్రముఖ మిమిక్రి కళాకారుడు వికాస్ ఉల్లి, సాయి వికాస్,భాస్కర్ రెడ్డి, గణేష్ ముక్క,వేణు కలికోట, శ్రవంత్ గుండా,శ్రీని జూపల్లి, వెంకట్ దండ, సునీల్ కుడికాల, వరుణ్ కుసుమ, రాఘవేందర్ బుయ్యాని, రఘువీర్, ప్రేమ్ సాగర్, కోటేష్ చిట్టిమళ్ల, ప్రవీణ్ ఆలెటి , టీవీ9 ఈశ్వర్ బండ, టీవీ 5 రాజశేఖర్, అమర్ పాశ్య ,కౌశిక్ సామ, వాసుదేవ్ మేకల, రఘు జువ్వాడి,వెంకట్ మందడి,రఘు తోట, హరి వేముల, క్రాంతి దూడం, రాజేష్ కాసారనేని, సందీప్ పునరెడ్డి, ప్రముఖ గీత రచయిత మరియు విఆర్ ట్యూన్స్ అధినేత వెంకట కృష్ణ రెడ్డి గుజ్జులా, సామ్ గుజ్జులా, మాల్గుడి వెజ్ అధినేత శివరాం, కిరణ్ ఉట్కూరి, అమ్మ షార్ట్ ఫిలిం డైరెక్టర్ హరీష్ బన్నాయి, శ్రీనివాస్ రెడ్డి బోబ్బా,కిరణ్ తెల్లపల్లి,అజయ్ కుండీకుఫుల్ల, దేవేందర్ మండల, సతీష్ చింతకుంట, మధు యనగంటి, కమలాకర్ నల్లాల, వెంకట్ చిలంపల్లి, క్రిష్ణ రమావత్, కిరణ్ బైరెడ్డి, ప్రసాద్ కంచర్ల, వేణు కే, శ్రీధర్ పాడురి, భాస్కర్ చల్ల, కిరణ్ వి, రఘు జూలకంటి, సంతోష్ కుమార్, అనిల్ నక్క, చారుహాసిని గోకరాజు, నవీన్ హరి, జయచంద్ర చెరుకూరి, డా.సుమన్ మంచిరెడ్డి, ఇతర స్నేహితులు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.