GTA: జిటిఎ బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింప చేస్తూ ప్రతి ఒక్కరికి సహాయపడటమే ధ్యేయంగా ఏర్పాటైన గ్లోబల్ తెలంగాణ సంఘం (GTA) వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ, తెలంగాణ సమాజాన్నీ ఏకం చేసేందుకు కృషి చేస్తోంది. అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలను తన కార్యక్రమాల ద్వారా ఒకే వేదికపైకి తీసుకువస్తోంది. మాతృరాష్ట్రంలో కూడా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. తెలంగాణ పండుగల్లో ముఖ్యమైన బతుకమ్మ వేడుకలను అమెరికాలోని పది నగరాల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డెన్వర్, రాలే, అట్లాంటా, యాష్ బర్న్, ఛార్లెట్, డిట్రాయిట్, అస్టిన్, సాల్ట్ లేక్ సిటీ, దేశ్ మెయిన్స్, ఫ్లోరిడాలోని తల్హసీలో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహిస్తోంది.
ఈ వేడుకలతోపాటు దసరా సంబరాలను కూడా ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాల్లో తెలంగాణ ఎన్నారైలతోపాటు, అమెరికాలోని తెలుగువారంతా పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు. జిటిఎ చైర్మన్ విశ్వేశ్వర్ కలవల, ప్రెసిడెంట్ ప్రవీణ్ కేసిరెడ్డి ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రెసిడెంట్ ఎలక్ట్ బాపు రెడ్డి కేతిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ లు శ్రవణ్ పోదూరు, అమర్ రెడ్డి, కిరణ్ బద్దం, మధున్యాలపట్ల, ప్రవీణ్ బిల్ల, రవీంద్ర గడ్డంపల్లి, శక్రునాయక్‌తోపాటు ఇతర ఇసి కమిటీ సభ్యులు, బోర్డ్ సభ్యులు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేస్తున్నారు. వివిధ నగరాల్లో జరిగే ఈ వేడుకల వివరాలకోసం ఫ్లయర్‌లను చూడవచ్చు.