మెక్సికో నుంచి అమెరికాకు భారతీయుల వలస
మెక్సికో నుంచి అమెరికాలోకి ప్రవేశించి ఆశ్రయం కోరుతున్న భారతీయుల సంఖ్య ఇటీవల సంవత్సరాల్లో పెరుగుతోందని మీడియా కథనమొకటి వెల్లడించింది. మొత్తం మీద నిర్బంధంలోకి తీసుకున్న వారిలో భారతీయుల శాతం తక్కువే అయినా ఇటీవల సంవత్సరాల్లో వారి సంఖ్య పెరుగుతోందని వలససేవల అధికారులను, అటార్నీలు ఉటంకిస్తూ లాస్ఏంజెలెస్ టైమ్స వెల్లడించింది. కాలిఫోర్నియాలోని విక్టర్విల్లే ఫెడరల్ కారాగారంలో ఆగస్టులో ఉన్న 680 మంది వలసదారుల్లో దాదాపు 380 మంది భారతజాతీయులేనని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ను ఉటంకిస్తూ పేర్కొంది. వారి ఇమిగ్రేషన్ కేసులు పెండింగ్లో ఉన్నందున నేరగాళ్ల హోదాలో కాకుండా పౌర నిర్బంధం కిందే ఉంచినట్లు తెలిపింది. వీరు కాకుండా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కు చెందిన ఇంపీరియల్ వ్యాలీ ఆవరణలో ఉన్న వారిలో 40 శాతం, అడెలాంటో ప్రాసెసింగ్ కేంద్రంలో నిర్భందంలో ఉన్న వారిలో 20 శాతం మంది భారతీయులేనని పేర్కొంది. 2018లో ఇప్పటివరకు సరిహద్దు సిబ్బంది అరెస్టు చేసిన వారిలో 4,197 మంది భారత జాతీయులనేని ఒక విశ్వవిద్యాలయం రూపొందించిన డేటాను ఉటంకించింది.













