NATS: నాట్స్ తెలుగు సంబరాలు – పెరుగుతున్న డిజిటల్ వాడకం
గత 22 ఏళ్లుగా దాదాపు అన్ని తెలుగు కాన్ఫరెన్స్ లలో పాల్గొనే తెలుగు టైమ్స్ (Telugu Times) కూడా ఆశ్చర్య పోయేలా నాట్స్ (NATS) తెలుగు సంబరాలలో కనిపించిన డిజిటల్ బోర్డ్ లు డిజిటల్ యుగం ఎలా అందరికి ఉపయోగ పడేలా ఉంటుందో చూపిస్తోంది.
నాట్స్ తెలుగు సంబరాల వేడుకలో అడుగడుగునా అనేక డిజిటల్ బోర్డ్ లు, ఎల్ఈడి స్క్రీన్ లు జరుగుతున్న ప్రోగ్రామ్ వివరాలు, వస్తున్న కళాకారులు – సినీ ప్రముఖుల వివరాలు, పాల్గొంటున్న స్పాన్సర్ కంపెనీల వివరాలు, వాటి వీడియోల తో కూడిన విశేషాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
ఎగ్జిబిషన్ హాల్ లో కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద సైజ్ లో ఎల్ఈడీ స్క్రీన్ లు పెట్టుకొని తమ కంపెనీ విశేషాలు ప్రదర్శిస్తూ అందరిని ఆకర్షించడం కనిపించింది.







