గ్రీన్ టీతో అల్జీమర్స్ కు చెక్!
గ్రీన్ టీ, కారెట్లు, బియ్యం, ఓట్స్‌లో ఉండే పోషకాలు అల్జీమర్స్ (మతిమరుపు) వంటి లక్షణాలను, జన్వుపరంగా సంక్రమించే నరాల సంబంధిత వ్యాధులను నిరోధిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ విషయాన్ని గుర్తించారు. ఎలుకలపై చేసిన ప్రయోగాలన్నింటినీ మనుషులకు ఆపాదించడానికి వీల్లేదు. కానీ.. మొక్కల ద్వారా అందే ఇలాంటి ఔషధ పదార్థాలు అల్జీమర్స్, చిత్తవైకల్యం వంటి లక్షణాల నుంచి రక్షణగా నిలుస్తాయని ఈ అధ్యయనం తెలియజేసిందని పరిశోధకులు తెలిపారు.













