వారానికి మూడుసార్లు గ్రీన్ టీ తాగితే…
వారానికి మూడు సార్లు గ్రీన్ టీ తాగితే మనిషి జీవితకాలం పెరగడంతో పాటు గుండెపోటు, స్ట్రోక్ ముప్పులను నివారించవచ్చని తాజా అధ్యయనం సృష్టం చేశారు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్తో హృదయం పదిలంగా ఉండటంతో పాటు ఎక్కువకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు తెలిపారు. చైనాలో లక్ష మందిపై జరిపిన అథ్యయనంలో గ్రీన్ టీ తాగేవారు తాగని వారితో పోలిస్తే సగటున 1.26 సంవత్సరాలు అధికంగా జీవించినట్టు గుర్తించారు. గ్రీన్ టీ తాగని వారి కంటే 1.4 ఏళ్ల తర్వాత గుండె పోటు వంటి వ్యాధుల బారిన పడ్డారని సుధీర్ఘంగా సాగిన అధ్యయనంలో వెల్లడైంది.













