అమెరికాలోకి గ్రాన్యూల్స్ ఔషధం
రోషే పాలో ఆల్టో ఎల్ఎల్సీ తయారు చేస్తున్న వాల్సైట్ బ్రాండెడ్ డ్రగ్కు జనరిక్ ఔషధాన్ని తయారు చేసి విక్రయించడానికి అమెరికాలోని గ్రాన్యూల్స్ ఫార్మాస్యూటికల్స్ ఐఎన్సీకి యూఎస్ఎఫ్డీఏ ఆమోదం తెలిపింది. నోటి ద్వారా తీసుకోవడానికి వాల్గాన్సిక్లోవిర్ హైడ్రోక్లోరైడ్ 50ఎంజీ/ఎంఎల్ ఓరల్ సొల్యూషన్ ను తయారు చేసి విక్రయించడానికి సమర్పించిన అబ్రిలియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ ఇది. సైటోమెగల్ వైరస్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి దీన్ని వినియోగిస్తారు.













