తానా లాస్ ఏంజెల్స్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ విజయవంతం
దక్షిణ కాలిఫోర్నియాలో మొట్టమొదటిసారిగా టేబుల్ టెన్నిస్ క్రీఢా పోటీలను తానా లాస్ ఏంజెల్స్ అద్వర్యంలో ఏప్రిల్ 21 న విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ క్రీఢా పోటీలలో సుమారుగా 100 మంది క్రీడాకారులు, పురుషులు, మహిళలు, మరియు పిల్లల విభాగాలలో పోటీపడటం జరిగింది.
తానా అధ్యక్షుడు సతీష్ వేమన గారు ముఖ్య అతిధిగా ఈ టేబుల్ టెన్నిస్ పోటీలను ప్రారంభించడం జరిగింది. లాస్ ఏంజెల్స్ అద్వర్యంలోని వివిధ తెలుగు సంఘాలవారు ఈ పోటీలలో పాల్గొనడం ముఖ్య విశేషం. ఉదయం 9 గం నుండి సాయంత్రం 6 గం ల వరకు రసావత్థరంగా సాగిన పోటీలలో పిల్లల విభాగంలో ఆశ్రయ్ ఆత్మకూరు విజేతగా విశ్రుత్ సాతులూరి రన్నరప్‌గా రావడం జరిగింది. పురుషుల సింగిల్స్‌లో సుధాం, హర్శ ఆత్మకూరు పై ఫైనల్స్‌లో విజయం సాధించారు. హోరా హోరీగా జరిగిన మహిళా సింగిల్స్ విభాగంలో అంపైర్లు రత్నబొంతు గారు మరియు పుష్ప పగిడ్యాల గారు లను ప్రధమస్థానంలో నిర్ణయించడం జరిగింది. రేఖ గారు ద్వితీయస్థానంలో నిలిచారు.
పురుషుల టీం విభాగంలో రాజారెడ్డి మరియు హితేన్ లు ప్రధమస్థానంలో కృష్ణసామంతుల, ప్రవీణ్ కీర్తి ద్వితీయస్థానం లో నిలిచారు. ఈ సంవత్సరం అక్టోబర్‌లో నిర్వహించే బ్యాక్టుస్కూల్, బ్యాక్ ప్యాక్స్ ప్రోగ్రాం కొరకు నిధులను సమకూర్చుకునేందుకు తానా లాస్ ఏంజెల్స్ వారు ఈ ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది.
ఈ ఆటల పోటీలో పాల్గొనడం ద్వారా ప్రతి ఒక్కరు రాబోయో విద్యా సంవత్సరములో కొంత మంది నిరుపేద విద్యార్థులకు కావాల్సిన బ్యాక్ ప్యాక్స్, పుస్తకములు, పెన్స్ మరియు పెన్సిల్స్ ఉచితముగా ఇవ్వడంలో భాగస్వాములు అయ్యారు.
ఈ పోటీలను విజయ వంతంగా నిర్వహించేందుకు తానా లాస్ ఏంజెలెస్ సిటీ కో-ఆర్డినేటర్ సురేష్ కందేపు, మరియు తానా లాస్ ఏంజెలెస్ ముఖ్య కార్యకర్తలు చంద్ర శేఖర్ పల్లెబోయిన, శ్రీకాంత్ మోపర్తి, వినోద్ బూరుగుపల్లి, శ్రీనివాస్ పోపూరి, రవీంద్ర జంగాల లు ఈ పోటీలు విజయవంతంగా నిర్వహించడం లో కీలక పాత్ర పోషించారు.
హర్ష ఆత్మకూరు, శ్రీహరి కొమ్మలపాటి, అమర్ కేతిరెడ్డి లు ఆటల పోటీలను నిర్వహించడం లో ఇతోధిక సహాయాన్ని అందించారు. దోసా ప్లేస్, టస్టిన్ వారు మధ్యాహ్న భోజనము మరియు సాయంత్రం టీ మరియు ఫలహారాలను ఇవ్వడం జరిగింది.
పోటీల ముగింపు లో సురేష్ కందేపు ఈ ఆటల పోటీల విజయానికి కారకులైన స్నేహితులు, కార్యకర్తలకు మరియు దోస ప్లేస్ వారికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేసారు. ఈ ఆటల పోటీలలో అంపైర్లుగా వ్యవహరించిన సతీష్ నండూరి, సెంథిల్ కుమార్, మురళి పోట్ల, రామ్ యార్లగడ్డ, శశాంక్ రెడ్డి, మీర్, సృజన్ యాపర్తి లకు ప్రత్యక కృతజ్ఞతలను తెలియచేసారు.













