సరికొత్తగా లాటా సంక్రాంతి వేడుకలు
లాస్‌ఏంజెలిస్‌లోని తెలుగు ప్రజలు సంక్రాంతి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. లాస్ ఏంజెలిస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 3,000 మంది పాల్గొన్నారు. జనవరి 18న వుడ్రోవిల్సన్ హైస్కూల్లో జరిగిన వేడుకల్లో వివిధరకాల సాంస్కృతిక ప్రదర్శనలతోపాటు, వంటల పోటీలు, ముగ్గుల పోటీలు, సాహిత్య పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ఎంతోమంది పాల్గొనడం విశేషం. కైట్ ఫెస్టివల్, బొమ్మల కొలువు, సంప్రదాయ వస్త్రధారణ, పెయింటింగ్ పోటీలు వంటివి కూడా ఏర్పాటు చేశారు. ఈ పోటీలకు యాంకర్‌గా సాహిత్య వ్యవహరించారు. ప్రత్యేక అతిధిగా లయ హాజరయ్యారు. లంబాడీ డ్యాన్స్, పులి డ్యాన్స్ వంటివి ఆకట్టుకున్నాయి. 250 మంది వలంటీర్లు ఉత్సాహంగా హాజరయ్యారు. సంగమం గ్రూపు ప్రదర్శించిన రామాయణం అందరినీ మైమరపింపజేసింది.













