జిడబ్ల్యుటిసిఎస్ – తానా వాలీబాల్ టోర్నమెంట్ సక్సెస్
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సంఘం- ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)తో కలిసి నిర్వహించిన గ్రాండ్ వాలీబాల్ టోర్నమెంట్ విజయవంతమైంది. ఇందులో 20 టీమ్‌లు పాల్గొన్నాయి. ఉమెన్స్ త్రోబాల్ పోటీల్లో 4 టీమ్‌లు పాల్గొన్నాయి. మొత్తం మీద 220 మంది ఆటగాళ్ళు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. 220 మందికిపైగా ప్రేక్షకులు ఈ ఆటలను తిలకించి తమ టీమ్‌లను ఉత్సాహపరిచారు. రోటీ ఎక్స్‌ప్రెస్ (రాజ్ బొప్పూరి)వారు అందరికీ ఫుడ్‌ను సరఫరా చేశారు. ఈ టోర్నమెంట్‌ను స్పాన్సర్ చేసిన వారికి, విజయవంతం చేసినవారికి, సుశాంత్‌కు జిడబ్ల్యుటిసిఎస్-తానా తరపున రవి అడుసుమిల్లి ధన్యవాదాలు తెలిపారు.













