విజయవంతమైన చికాగో ఆంధ్ర అసోసియేషన్ వన భోజనాలు
చికాగో ఆంధ్ర అసోసియేషన్ ఈ సంవత్సరం జూలై నెల తొమ్మిదవ తారీకున వన భోజనాలు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి 800 లకు పైగా పిల్లలు పెద్దలు ఉత్సాహంగా హాజరైనారు. చక్కని ఆహ్లాద కరమయిన ప్రకృతి వాతావణంలో ఈ వనభోజనాల కార్యక్రమంలో సాంప్రదాయ పద్ధతిలో అరటి ఆకు లో వడ్డించిన వంటలు పిండి వంటలు షడ్రుచుల భోజనం అందరికీ పెళ్లి విందును తలపించి చాలా తృప్తి చెందారు.
పిల్లలు పెద్దలు ఆటల పోటీలు, పతంగుల పోటీలు, వంటల పోటీలు లాంటి తెలుగుతనపు వివిధ కార్యక్రమాలతో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొని బహుమతులు గెలుచుకొని సాయంత్రం వరకు సంతోషంగా గడిపి వెళ్లారు.
ఈ వనభోజనాలు కార్యక్రమాన్ని ప్రెసిడెంట్ మాలతి దామరాజు గారు, చైర్పర్సన్ సుజాత అప్పలనేని గారు ఆధ్వర్యంలో బోర్డు మెంబర్స్, కోర్ మెంబర్స్, వాలంటీర్స్ అంతా కలసి ఎంతో కష్టపడి వచ్చిన అతిధులందరినీ సంతృప్తి పరచి అందరి మన్ననలను పొందడం నిజంగా చాలా గొప్ప విషయం.
ఈ కార్యక్రమం ప్రెసిడెంట్ మాలతి దామరాజు గారు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం సిఏఏ నిర్వహించిన ఎన్నో కార్యక్రమాలలో మరొక హైలైట్ అని అందరూ అభినందించారు.
ఈ వనభోజనం కార్యక్రమానికి ప్రఖ్యాత కార్టూనిస్ట్ శ్రీ శ్రీధర్ గారు, ఆశాజ్యోతి మాధవి మల్లవల్లి గారు ప్రత్యేక అతిధులుగ వచ్చారు.
శ్రీకృష్ణ మతుకుమల్లి మరియు సురేష్ అయినపూడి గారికి ప్రెసిడెంట్ మాలతీ గారు ప్రత్యేక ధన్యవాదాలు సభా ముఖంగా తెలియ చేసారు.
Farmstocook వారి Chicken bbq ని ఆస్వాదించి Patel Brothers వారి Samosa and Mango juice తో సేదతీరి, క్రొత్తగా launch అయిన ఆha Snacks తింటూ ఆహా అని తెగ మెచ్చుకొని, అదరహో అనిపించిన Godavari Restaurant వారి విందుభోజనం తో ప్రతి ఒక్కరు ఎంతో ఆనందించారు. Past President శైలేష్ మద్ది పిల్లల కొసం చేసిన Cotton Candyని పిల్లలు లొట్టలు వేసుకుంటు తిన్నారు. Farmstocook, Patel Brothers, ఆha Snacks, Sailesh Maddiki మరియు Godavari Restaurant Naperville వీరందరికి ప్రెసిడెంట్ మాలతీ గారు ప్రత్యేక ధన్యవాదాలు సభా ముఖంగా తెలియచేసారు.
శ్వేత కొత్తపల్లి గారు నిర్వహించిన Cooking Contest లో 1st శిరీష బోయిన, 2nd స్వప్న వణుకూరి విజేతలు గా నిలిచారు. బేకింగ్ విభాగంలో అర్చిత దామరాజు మొదటి స్థానంలోను దివ్య పుట్టారెడ్డి 2 వ స్థానంలోను విజేతలు గా నిలిచారు .
పావని కొత్తపల్లి గారు Kite Contest నిర్వహణలో 1st కళ్యాణ్ కొత్తపల్లి, 2nd ఆశ్రీత్ కొత్తపల్లి విజేతలుగా నిలిచారు. వీరందరికి ప్రఖ్యాత కార్టూనిస్ట్ శ్రీ శ్రీధర్ గారు, ఆశాజ్యోతి మాధవి మల్లవల్లి గారు బహుమతులు అందించారు.
శిరీష, హరిణి గారు Khokho Women మరియు శ్రీలక్ష్మి, అనూష గారు Khokho Kids, మరియు ప్రవీణ, స్వాతి గారు Laddata Kids, Kabaddy రాధిక గారు నిర్వహించారు. Youth Club నిర్వహించిన Carnival games పిల్లలని ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
Cosmos Dijital మరియు స్వదేశి మీడియా వారికీ మరియు చక్కని Promo ను రూపొందించిన లక్ష్మినాగ్ సూరిభొట్ల గారికి ఈ వనభోజనం కార్యక్రమానికి సహాయ సహకారాలందించి విజయ వంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రెసిడెంట్ మాలతీ దామరాజు గారు కృతజ్ఞతలు తెలియ చేసారు.













