డొక్లాంపై భారత్ స్పందించాలి : అమెరికా
డొక్లాం భూభాగంలో చైనా తన కార్యకలాపాలను చాప కింద నీరులా విస్తరింపజేస్తోందని, పొరుగున ఉన్న భూటన్, ఇండియా ఏం అనడం లేదని అమెరికా ఆరోపించింది. చైనా దక్షిణ సముద్రంపై సౌర్వభౌమా ధికారాన్ని ప్రకటించిందని, వియత్నాం, మలేషియా, పిలిఫిన్స్, బ్రూనై, తైవాన్లకు ప్రతివాదిగా నిలుస్తోందని అమెరికా అధికారి అన్నాడు. చైనా, దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రం రెండింటిలోనూ వివాదాల్లో నిమగ్నమై ఉందని తెలిపారు. బీజింగ్ తన మిలటరీ బలగాన్ని పెంచుకుంటూ పోతోందని, రెండు వివాదాస్పద సముద్ర భాగాల్లో అపార మినరల్స్, ఆయిల్, సహజ వనరుల సంపద ఉందని అన్నారు.
భారత్ తన ఉత్తర సరిహద్దును రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని, ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశం అని దక్షిణ, మధ్య ఆసియాల ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఎలైస్ జీవెల్స్ అన్నారు. భారత్ స్థిరత్వానికి నిలుపుకోవడం అనేది చైనాకు ఎంతో కలిసి వస్తోందని, అందుకే భాగస్వామ్య దేశంగా చైనా సంతోషంగా ఉందని వేల్స్ అన్నారు. కాంగ్రెస్ సభ్యురాలు వాగ్నర్ మాట్లాడుతూ దక్షిణ సముద్రాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునే వ్యూహంలోనే భాగంగానే చైనా ఈ చర్యకు పాల్పడుతోందని అన్నారు. తాజాగా చైనా, భారత్ ఆర్మీ క్యాంపులకు 80 మీటర్ల దూరంలోనే నిర్మాణ పనులు చేపడుతోందని, అయినా భారత్ ఎలాంటి చర్యలకు దిగడం లేదని అమెరికా ప్రతినిధి అన్నారు.













