కెమ్ చో కాదు..నమస్తే ట్రంప్
తొలిసారిగా భారత్‌కు విచ్చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన కోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండు రోజుల పర్యటన కోసం ట్రంప్ ఈ నె 24న భారత్‌కు రానున్నారు. ఆయన రాక సందర్భంగా నిర్వహించనున్న మెగా ఈవెంట్ పేరును కేంద్రం నమస్తే.. ప్రెసిడెంట్ ట్రంప్ గా మార్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం అంతకు ముందు దీనికి కెమ్ చో ట్రంప్ అనే పేరు పెట్టారు. జాతీయ విధానంలో భాగంగా ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ట్రంప్ ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌కు విచ్చేస్తారు. అక్కడి నుంచి ఆయన టూర్ మొదవుతుంది. ఈ సందర్భంగా భారీ రోడ్ షో ఏర్పాటు చేయనున్నారు. అహ్మదాబాద్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు నుంచి సబర్మతీ ఆశ్రమం వరకూ.. ఆ తర్వాత ఇందిరా బ్రిడ్జ్ మీదుగా మొతేరా స్టేడియం వరకూ మొత్తం 22 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో సాగుతుంది.అక్కడ కొత్తగా నిర్మించిన స్టేడియం ప్రారంభోత్సవం తర్వాత మోదీ, ట్రంప్ మాట్లాడతారు.













