‘‘గోవిందా రక్షమాం కరోనాతః” పోటీలో పాల్గొనండి
అన్నమాచార్య భావన వాహిని(భారత్), నార్త్ అమెరికా తెలుగు సంఘం, (యుఎస్ఎ) సంయుక్తంగా ప్రపంచ ప్రార్థన గీతాలాపన పోటీలను నిర్వహిస్తున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డా శోభారాజు రచించి, సంగీతం సమకూర్చిన గోవిందా రక్షమాం కరోనాతః ప్రార్థనా గీతాన్ని మీరు కూడా అదే రాగంలో, అదే తాళంలో పాడి వీడియో లింక్ ద్వారా పంపించాలని నిర్వాహకులు కోరారు. ఒకవేళ మీరు పాడిన ఈ?గీతాన్ని ఫేస్‌బుక్‌లోనూ, ఇతర మాధ్యమాల్లోనూ పెట్టినా వాటి లింక్‌లను కూడా పంపించాలి. వచ్చిన వీడియో లింక్‌లను పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తారు.
ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు నాటా వాళ్ళు నిర్వహించే మహాసభల్లో బహుమతులను అందజేస్తారు. అలాగే పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో పాడే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. టీవీ ఏసియాలో కూడా మీరు పాడే అవకాశం మీకు కలుగుతుంది. ఆలస్యం చేయకుండా వెంటనే మీరు ఆ ప్రార్థనా గీతాన్ని పాడి వీడియో తీసి వెంటనే మాకు పంపించండి. వీడియోలింక్లను ఇక్కడ ఇచ్చిన ఇ-మెయిల్‌కు పంపాలి. మే 24లోగా మీరు ఈ వీడియోను మాకు పంపాలి. ఆ గడువుదాటిన తరువాత వచ్చే వీడియోలను పరిశీలించరు.
namastheannamayya108@gmail.com













