సంచలనం సృష్టించిన గూగుల్
క్యాంటమ్ కంప్యూటింగ్ రంగంలో గూగుల్ సంస్థ సరికొత్త చరిత్రకు నాంది పలికింది. సూపర్ కంప్యూటర్లను మించిన వేగంతో పని చేసే అత్యాధునిక సికమోర్ చిప్‌ను అభివృద్ధి చేసింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ 10 వేల ఏళ్లలో పూర్తి చేసే గణనను ఈ క్యాంటమ్ కంప్యూటింగ్ చిప్ కేవలం 200 సెకన్లలో పూర్తిచేసినట్లు గూగుల్ ప్రకటించింది. తాజా ఆవిష్కరణను క్యాంటమ్ సుప్రిమసీ గా అభివర్ణించింది. సాధారణ కంప్యూటర్లు బైనరీ సంఖ్యల ఆధారంగా డేటా ప్రక్రియలను నిర్వహిస్తాయి. సికమోర్ చిప్ బైనరీ సంఖ్యలతో పాటు 54 క్యూబిట్స్‌తో కూడిన క్యాంటమ్ ప్రాసెసర్ ఆధారంగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చిప్‌లో ప్రతి క్యూబిట్ మరో నాలుగు క్యూబిట్లతో అనుసంధానమై ఉంటుంది. ఫలితంగా గణన ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతుందని గూగుల్ కృతిమ మేధ (ఏఐ) శాస్త్రవేత్త జాన్ మార్టిన్స్ తెలిపారు.













