గూగుల్ కీలక నిర్ణయం..
2025 నాటికి సంస్థ లీడర్షిప్ బాధ్యతల్లో 30 శాతాన్ని ఇప్పటివరకు ప్రాతినిథ్యం లేని వర్గాలకు కేటాయించాలని మంచి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటివరకు ప్రాతినిథ్యం లేని వర్గాలకు కేటాయించాలని భావిస్తున్నామని అల్ఫాబెట్ సిఇఒ సుందర్ పిచాయ్ చెప్పారు. అమెరికాలో నల్లజాతీయులు పోలీసుల చేతిలో హతమైన నేపథ్యంలో గూగుల్ సహా వివిధ సంస్థలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో గూగుల్ అప్రమతమైంది. ప్రస్తుతం గూగుల్ లీడర్షిప్ బాధ్యతల్లో 96 శాతం మంది తెల్లజాతీయులు, ఆసియా వ్యక్తులు ఉన్నారు. ఇందులో 73 శాతం మంది పురుషులు. అంతర్గత పదోన్నతులతో పాటు బయటి సంస్థల నుంచి కూడా ఎంపికచేసిన వారికి గూగుల్లో నాయకత్వ బాధ్యతలు ప్రస్తుతం వస్తున్నాయి. వర్ణ వివక్షను దూరం పెట్టే విధానాలు కూడా అవలంభిస్తామని సుందర్ పిచాయ్ సృష్టం చేశారు. 2025 నాటికి కంపెనీలో ప్రాతినిథ్యం లేని వారికి 30 శాతానికి పైగా అవకాశం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
సిలికాన్ వ్యాలీ కంపెనీలు తరచూ సీక్రెటింగ్ రిక్రూట్మెంట్స్, అంతర్గత ప్రమోషన్ల ద్వారా నియమించుకుంటాయి. దీంతో అవకాశాలు బయట వారికి తెలియకుండా పోతున్నాయి. అన్ని లీడర్షిప్స్ను ఓపెన్ గా ఎంచుకుంటాయని తెలిపారు. అలాగే జాతిపరమైన ప్రొఫైలింగ్కు దారితీసే కార్యాలయ భద్రతా విధానాన్ని తొలగిస్తామని సుందర్ పిచాయ్ చెప్పారు. పలు కంపెనీల్లో బ్లాక్ ఉద్యోగులను అన్యాయంగా తనిఖీ చేయడం జరుగుతుందని చెబుతున్నారు. ఇది పక్షపాతమే అవుతుందని సుంందర్ పిచాయ్ అంగీకరించారు. అలాగే బ్లాక్ బిజినెస్ ఓనర్స్కు 150 మిలియన్ డాలర్లు ప్రకటించారు పిచాయ్. బ్లాక్ వినియోగదారులకు సహాయపడు ప్రాజెక్టుపై పనిచేసేందుకు అంతర్గత టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది.













