ఆ యాప్‌లపై శాశ్వతంగా నిషేధం : గూగుల్
నేటి నుంచి టీ20 క్రికెట్ లీగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బెట్టింగ్‌ను కట్టడి చేయడంపై ప్రముఖ సెర్చింజన్ గూగుల్ చర్యలు చేపట్టింది. బెట్టింగ్‌లకు వీలు కల్పించే యాప్‌లను తాము అనుమతించబోమని సృష్టం చేసింది. బెట్టింగులు తమ విధానాలకు వ్యతిరేకమని, అలాంటి అప్లికేషన్లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగిస్తామని వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ అలాంటి చర్యలకు వీలు కల్పించే యాప్‌లను నిబంధనలు పాటించేవరకు అనమతించేది లేదని సృష్టం చేసింది. పదే పదే అలాంటి చర్యలకు పాల్పడితే వాటిపై శాశ్వతంగా నిషేధం విధిస్తామని తెలిపింది.













