ఆ పొరపాటు మాదే…క్షమాపణలు చెప్పిన గూగుల్
ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కాంటాక్ట్ లిస్టులో ఎవరి ప్రవేయం లేకుండా ఓ కొత్త పోన్ నెంబర్ జతచేరిన విషయం తెలిసిందే. ఆ నెంబర్ వేలాది ఫోన్లలో కనిపించింది. దీంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. అది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా టోల్‌ఫ్రీ నెంబర్. నెంబర్‌ను ఫోన్లో సేవ్ చేయకుండానే కాంటాక్ట్ లిస్టులోకి ఎలా వచ్చిందా అని ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు టెన్షన్ పడ్డారు. ఓ వ్యక్తి తన కాంటాక్ట్ లిస్టును స్క్రీన్‌షాట్ తీసి ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. దీంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సంఘటనపై గూగుల్ సంస్థ స్పందించింది. ఆ పొరపాటు మాదే అని ఆ సంస్థ అంగీకరించింది. ఆ ఘటన పట్ల గూగుల్ క్షమాపణలు కూడా చెప్పింది. స్మార్ట్ఫోన్లలో యూఐడిఏఐ నెంబర్ అనుకోకుండా వచ్చి చేరిందని గూగుల్ సంస్థ వెల్లడించింది. అయితే ఫోన్ యూజర్లలోకి ఎవరూ అక్రమంగా చొరబడలేదని ఆ సంస్థ సృష్టం చేసింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌లోని సెటాప్ విజార్డ్‌లో, హెల్ప్‌లైన్ నెంబర్ అప్రమేయంగా కోడ్ అయినట్లు సంస్థ తెలిపింది. యూజర్లు ఆ నెంబర్‌ను డిలీచ్ చేయవచ్చు అని గూగుల్ సంస్థ వెల్లడించింది.













