టిఫాస్ కాలేజీ కౌన్సిలింగ్ కు మంచి స్పందన
న్యూజెర్సి తెలుగు కళాసమితి (టిఫాస్) నిర్వహించిన కాలేజి కౌన్సిలింగ్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. అమెరికాలో ఉంటున్న కె 12 స్కూల్ తెలుగు విద్యార్థులకోసం విద్యాసాగర్ అమ్ము, స్టూడెంట్ మెంటర్స్ తో కలిసి జూలై 26వ తేదీన ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. టిఫాస్ యూట్యూబ్ ఛానల్లో జరిగిన ప్రత్యక్ష ప్రసారాన్ని ఎంతోమంది వీక్షించారు. 100మందికిపైగా హాజరైన ఈ సదస్సులో మొదట టిఫాస్ ప్రెసిడెంట్ శ్రీదేవి జాగర్లమూడి అందరినీ స్వాగతించి, కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుగా కొత్త కమిటీని పరిచయం చేశారు. టిఫాస్ ఉపాధ్యక్షులు బిందు యలమంచిలి, కార్యదర్శి ఉషాదరిసిపూడి, కోశాధికారి జ్యోతి గండి, ఈవెంట్స్ చైర్ అనూరాధ పారా, ఐటీ చైర్ అనూరాధ దాసరి, మెంబర్ షిప్ చైర్ శ్రీనివాస్ చెరువు, యూత్ చైర్ యశోద దశిక, కమ్యూనిటీ చైర్ రవి అన్నదానంను అందరికీ పరిచయం చేశారు. విద్యాసాగర్‌ను, ఆరుగురు స్టూడెంట్ మెంటర్స్ శ్వేత, భార్గవి, నవ్య, నటాష, ఆదిత్య, అఖిలలను ఆహ్వానించారు.
కాలేజీ అడ్మిషన్‌కోసం హైస్కూల్ విద్యార్థులు తీసుకోవాల్సిన కోర్సుల గురించి విద్యాసాగర్ వివరించారు. యుఎస్‌లో ఉన్న వివిధ ఐవివై లీగ్ స్కూల్స్ ఏ మేజర్‌కు ప్రసిద్ధమో, ఎటువంటి కోర్సులు Ivy League Schools లోనికి ప్రవేశం సులభమవుతుందో చాలా చక్కగా వివరించారు. టిఫాస్ అడ్వయిజర్ రాంకొల్లూరు కూడా ఎటువంటి కాలేజీల్లో తక్కువ ఫీజుకు మంచి కోర్స్‌లు ఆఫర్ చేస్తారో సోదాహరణంగా వివరించారు.
ఈ కార్యక్రమాన్ని చక్కగా సమన్వయపరచడంలో యశోద ఎంతో సహాయపడ్డారు. శ్రీదేవి విద్యార్థులందరికీ ఎంతో ఉపయుక్తమైన ప్రశ్నలను పొందుపరచి మెంటర్స్ ను అడిగారు. వారు కూడా చక్కని సమాధానములతో వివరించారు. బిందు యలమంచిలి యశోద దశిక మరియు శ్రీనివాస్ చెరువు కార్యక్రమమునకు రిజిష్టర్ చేసుకున్న వారి నుంచి వచ్చిన ప్రశ్నలు విద్యాసాగర్ అమ్ము గారికి అందచేసారు. అను దాసరి అనురాధ పారా మరియు రవి అన్నదానం గారు సాంకేతికముగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు. కార్యదర్శి ఉష దరిసిపూడి కార్యక్రమాన్ని వీక్షించిన అందరికీ టిఫాస్ బృందము తరపున కృతజ్ఞతలు తెలియచేసారు.













