అంగరంగ వైభవంగా గోల్డెన్ గ్లోబ్స్
ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ నగరం వేదికగా మారింది. కార్యక్రమానికి ప్రముఖ హాలీవుడ్ తారలంతా అట్టహాసమైన వస్త్రధారణతో హాజరై తమ అందచందాలతో ఆహూతులను అలరించారు. ప్రపంచ దేశాల నుంచి పోటీపడిన పలు సినిమాల్లోంచి ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి పురస్కారాలు అందజేశారు. ఈ సారి విజేతల జాబితాలో అమెరికన్ హాస్య ప్రధాన చిత్రం గ్రీన్‌బుక్ మూడు పురస్కారాలతో అగ్రస్థానం దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో బ్రిటిష్ చిత్రం బొహెమియన్ రాప్సొడీ, స్సానిష్ చిత్రం రోమా చెరో చెండు పురస్కారాలతో నిలిచాయి. వివిధ విభాగాల్లో విజేతలు : ఉత్తమ చిత్రం (డ్రామా) : బొహెమియన్ రాప్సొడీ, ఉత్తమ చిత్రం (మ్యూజికల్ ఆర్ కామెడీ) : గ్రీన్ బుక్, ఉత్తమ నటుడు (డ్రామా) : రమి మలెక్ (బొహెమియన్ రాప్సొడీ), ఉత్తమ నటుడు (మ్యూజిక్ ఆర్ కామెడీ) : క్రిస్టియల్ బాలె (వైస్), ఉత్తమ నటి (డ్రామా) : గ్లెన్ క్లోజ్ (ది వైఫ్), ఉత్తమ నటి (మ్యూజికల్ ఆర్ కామెడీ) : ఒలీవియా కోల్మన్ ( ది ఫేవరెట్ ), ఉత్తమ సహాయ నటుడు : మహెర్షలా అలీ (గ్రీన్‌బుక్), ఉత్తమ సహాయ నటి: రెజీనా కింగ్ (ఇఫ్ స్ట్రీట్ కుడ్ టాక్), ఉత్తమ దర్శకుడు : అల్ఫొన్సొ కౌరొన్ (రోమా), ఉత్తమ స్క్రీన్‌ప్లే : నిక్, బ్రియాన్ క్యూర్రీ, పీటర్ (గ్రీన్ బుక్), ఉత్తమ విదేశీ భాషా చిత్రం : రోమా, ఉత్తమ యానిమేషన్ చిత్రం : స్పైడర్‌మ్యాన్ : ఇన్ టు ది స్పైడర్ వెర్స్.













