TANA: తానాలో గోదావరి జిల్లా వాసుల సమావేశం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) డిట్రాయిట్‌లో నిర్వహించిన 24వ తానా మహాసభల్లో ఉమ్మడి గోదావరి జిల్లా వాసుల ఆత్మీయ సమ్మేళనం ఆకట్టుకుంది. ఈ సమావేశంలో ఎపి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, సినీ నటుడు మురళీమోహన్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. రాజేష్ మహసేన, రోషన్ సంగా, ముళ్ళపూడి బాపిరాజు, వసంతకుమార్, టివిఎస్ ప్రతాప్‌తోపాటు గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొని మాట్లాడారు. గోదావరి జిల్లా అభివృద్ధి, ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.
ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు కోసం గోదావరి జిల్లావాసులు చేసే త్యాగం రాష్ట్రం మరువదని చెప్పారు. వారి త్యాగం వల్ల రాయలసీమ జిల్లాలకు పోలవరం నీరు అందుతుందని అన్నారు. ఈ సమావేశాన్ని డాక్టర్ సుబ్బాయంత్ర, సుమంత్ పుసులూరి, డా. ప్రసాద్ నల్లూరి, జాని నిమ్మలపూడి, సతీష్ చుండ్రు, రాంప్రసాద్ చిలుకూరి, సత్యనారాయణ మన్నె, కిషోర్, సతీష్ మేక, మహేష్ తదితరులు సమన్వయపరిచారు.
ఈ క్రింది లింక్ లో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. చూడగలరు.







