ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 2 లక్షలు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 2లక్షలు దాటాయి. భారత్‌లో ఈ సంఖ్య 151కి పెరిగింది. కాగా ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల్లో 255మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వీరితో సహా విదేశాల్లో ఉన్న భారతీ యుల్లో మొత్తం 276మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. జాన్హాఫ్ కిన్స్ విశ్వవిద్యాలయం, ప్రపంచ ఆరోగ్య సంస్థల లైవ్‌ట్రాకింగ్ మేరకు బుధవారం రాత్రికి ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 8వేలు దాటింది. ఇదిలా ఉంటే భారత్‌లో కరోనా ప్రభావ అంచనాలపై ప్రపంచ వ్యాప్తంగా అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ సంస్థ ఎకనామిక్స్ అండ్ పాలసీచీఫ్ మీడియాతో మాట్లా డుతూ చైనా, ఇటలీ, దక్షిణకొరియా, ఇరాన్‌ల తర్వాత భారతే కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్ కావొచ్చని హెచ్చరించారు. భారత్ లోని 20శాతం మంది జనాభా వరకు కరోనా ప్రభావానికి గుర య్యే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. అమెరికా వినియో గించిన అంచనాల మేరకు భారత్‌లో 70కోట్ల మందిపై కరోనా ప్రభావముంటుందని స్పష్టం చేసారు. ఇప్పటికే భారత్‌లో పదివేలకు పైగా గుర్తించబడని కేసులుండే అవకాశాన్ని ఈ సంస్థ అంచనాలేసింది.













