రెండు లక్షలు దాటిన కరోనా మరణాలు
కరోనా మృతుల సంఖ్య శనివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలు దాటింది. ఇప్పటివరకు దాదాపు 2,00,810 మంది మరణించగా, 28.84 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. ఒక్క అమెరికాలోనే 52,900 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 9.41 లక్షల మందికి వైరస్ సోకింది. అమెరికాలో పది రోజుల్లోనే మరణాల సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. కరోనా మహమ్మారిపై అబద్దాలు చెప్పినందుకు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేయాలని కోరుతూ భారతీయ అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ (48) స్టాఫ్ కమ్యూనిస్ట్ చైనా పేరిట ఆన్లైన్ ప్రచారాన్ని ప్రారంభించారు.













