అమెరికాలో గ్లెన్ మార్క్ డెర్మటాలజీ ఔషధాలు
దేశీయ ఔషధ కంపెనీ గ్లెన్మార్క్ ఫార్మా, అమెరికా బ్రాండెడ్ చర్మవ్యాధుల (డెర్మటాలజీ) ఔషధ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. అమెరికాలోని అనుబంధ కంపెనీ గ్లెన్మార్క్ థెరాప్టిక్స్ ద్వారా ఈ ఔషధాలను మార్కెట్ చేయనున్నట్టు తెలిపింది. కంపెనీ ఇప్పటికే అమెరికాలోని జనరిక్ డెర్మిటాలజీ ఔషధాలు మార్కెట్ చేస్తోంది. ఇటీవల అమెరికాకు చెందిన ఎక్సెల్టిస్ యుఎస్ఏ అనే కంపెనీ నుంచి గ్లెన్మార్క్ ఏడు బ్రాండెడ్ డెర్మిటాలజీ ఔషధాలను కొనుగోలు చేసింది. వీటికి తోడు మరిన్ని బ్రాండెడ్ డెర్మటాలజీ ఔషధాలను అమెరికా మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది.













