తనకు మరో అవకాశం ఇవ్వండి
తనకు మరో అవకాశమివ్వాలని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ కోరారు. ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని లండన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ ఎనలిటికా సంస్థ అక్రమంగా ఉపయోగించుకోవడంపై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికే క్షమాపణలు చేపిన ఆయన మీడియా సమావేశంలో మరోసారి క్షమాపణలు తెలిపారు. కంపెనీ నడిపంచడానికి మీరే సరైన వ్యక్తి అనుకుంటున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన తకు మరో అవకాశమివ్వాల్సిందదిగా కోరారు. చాలా పెద్ద పొరపాటు జరిగిందని, దీనికి తానే భాద్యుడనని అన్నారు. ఎవరైనా సరే తప్పులు చేస్తారని, అయితే వాటి నుంచి గుణపాఠం నేర్చుకుంటారని పేర్కొన్నారు. ఈ ఘటన వల్ల కంపెనీ నుంచి ఎవరినీ తొలగించలేదని వెల్లడించారు.













