డొనాల్డ్ ట్రంప్‌కు షాక్
దుందుడుకు వ్యాఖ్యలకు మారుపేరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మిత్రుల కంటే శత్రువులు ఎక్కువయ్యారు. వలసల విషయంలో ట్రంప్ నిర్ణయాలు, చర్యలపై వారంతా నిరసనలు తెలియజేస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ పర్యటనకు వ్యతిరేకంగా బ్రిటిషర్లు వినూత్నంగా నిరసన తెలిపారు. టాయిలెట్ పై ట్రంప్ కూర్చున్నట్లు ఉన్న పెద్ద బొమ్మను లండన్ నగరంలో ఏర్పాటు చేశారు. దాని తలపై అమర్చిన టోపీపై అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దామా? నన్ను పదవీచ్యుతుడిని చేయండి అని రాశారు. త్రాఫాల్గర్ స్క్వేర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ బొమ్మ వద్ద భారీగా గుమిగూడిన ప్రజలు ట్రంప్ రాకకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.













