అమెరికా మాజీ మహిళ బాక్సర్ ఇక లేరు
రెండు సార్లు ప్రపంచ హెలీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్, ప్రముఖ రచయిత, మంచి రాజకీయవేత్త జార్జ్ ఫోర్మన్ కూతురు ఫ్రీదా ఫోర్మన్ హఠాన్మరణం చెందింది. శనివారం ఆమెను పలకరించడానికి వచ్చిన కుటుంబ సభ్యులకు ఆమె మృతదేహం కనిపిచింది. ఆమె ఎందుకు, ఎలా మరణించిందో ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఇది హత్య కాదనే భావిస్తున్నారు. 42 ఏళ్ల ఫ్రీదా 2000 సంవత్సరం నుంచి 2001 వరకు ఏడాది పాటు బాక్సర్‌గా ఉంది. తన ఏడాది బాక్సింగ్ కెరీర్లో సాధించిన 5 విజయాల్లో 3 నాకౌట్లు నమోదు చేసింది. కేవలం ఒకే ఒక్కసారి ఓటమిపాలైంది. జార్జ్ ఫోర్మన్ 12 మంది సంతానంలో ఫ్రీదా ఒకరు. బాక్సింగ్ ప్రమోటర్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణ చేస్తూ వస్తోందామె.













