అమెరికాలో అతిపెద్ద గోశాల!
“పురుషోత్తముడు” గోపబాలుడే!
సకల చరాచర సృష్టిని నియంత్రించే “జనార్ధనుడు” గోకులవాసుడే!
గోవు పరమ పవిత్రతకు ప్రత్యక్షరూపం. అందుకే సాక్షాత్తు పరమపురుషుడే గోకులాన్ని తన కులంగా ఎంచుకున్నాడు. సకల దేవత స్వరూపమయిన గోవును సేవించడంకన్నా ఉత్తమోత్తమమైనది మరొకటి భూతలంలో లేదు అంటే అతిశయోక్తి కాదు. హిందువులు ఆరాధించే ముక్కోటి దేవతలు గోమాతలో నెలవైవుంటారు. ఋషులలో సప్తర్షుల స్థానం వేరు. త్రిమూర్తులు కూడా వారిని కొనియాడుతారు. అలాగే వేదాలు సహితం మాతృమూర్తిని, గురుపత్నిని, గోవుని, ప్రభుపత్నిని, బ్రాహ్మణుని అర్ధాంగిని, సేవకురాల్ని మరియు భూమిని మాతృమూర్తులగా ఆరాదించామని సూచిస్తాయి. ఋషులలో సప్తర్షుల స్థానం వేరు. త్రిమూర్తులు కూడా వారిని కొనియాడుతారు. అలాగే వేదాలు సహితం మాతృమూర్తిని, గురుపత్నిని, గోవుని, ప్రభుపత్నిని,బ్రాహ్మణుని అర్ధాంగిని, సేవకురాల్ని మరియు భూమిని మాతృమూర్తులగా ఆరాధించమని సూచిస్తాయి. హిందువులు సమస్త ప్రాణకోటిలోను దైవాన్ని లేదా దైవంశాన్ని చూసే విశేష గుణం వున్నవారు అయినప్పటికీ గోవుని మాత్రం కన్న తల్లిగా భావించారు.
ఋషులు సాధుపుంగవులు అందుకే ఋషివాటికలు సాధుజంతువులైన గోవులకి నెలవై పరమ పవిత్రతో విరజుల్లుతుండేవి. చతుర్విధ పురుషార్ధాలైన ధర్మ, అర్థ, కామ మరియు మోక్షల్ని గోపూజతో పొందవచ్చన్నది సత్యం. హిందువులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు కాబట్టి ఆచరించాలనుకుంటారు. పాపకర్మలు చేస్తే నరక సంప్రాప్తి అలాగే పుణ్యకర్మలు చేస్తే స్వర్గ సుఖాలు లేదా మోక్షప్రాప్తి అనేది అందరూ స్వతః నమ్ముతారు. అన్నదానం, ఉపవాసం, ధ్యానం లేదా తపస్సు, ధార్మికత లేదా ఇతరులకి సహాయం చేయడం, దైవ ప్రార్ధన, వేదం పఠనం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, యజ్ఞ యాగాదులు నిర్వహించడం లేదా పాల్గొనడం. ఇంతటి ఉత్క్రుష్టమైన మోక్షప్రాప్తి గోసేవ లేదా గోపూజ వాళ్ళ సంప్రాప్త మవుతుందని నమ్మారు రామాయణాన్ని రచించిన వాల్మీకి, మహాభారతాన్ని రాసిన వ్యాసమహర్షి.
భారతదేశం ఎన్నో మేలుజాతి గుజరాత్ రాష్ట్ర గిర్, రెడ్ సింధీ, రతి, సాహీవాల్, అమృతమహల్, కిలారి మొదలైన ఆవులకి ప్రాశస్త్యం. మెంఫిస్ గోశాలలో ప్రస్తుతం భారతదేశం నుంచి వచ్చిన గుజరాత్ గిర్ ఆవులు 80 పైగా వున్నాయి. శ్రద్ధ సబూరి సమిధ ధార్మిక సంస్థ ఈ గోశాలని ధనాపేక్ష లేకుండా నిర్వహిస్తోంది. 2019 ప్రారంభం నాటికీ 108 ఆవుల్ని సంరక్షించాలన్నది ఈసంస్థ వారి ఉద్దేశం. నవంబర్ 17 న ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గోశాలని ప్రత్యేకంగా చూడటానికి, ముఖ్యంగా పిల్లలు వారి తల్లితండ్రులతో కలసి అరటిపళ్ళు, క్యారట్లు వంటి ఆహరం గోవులకి ఇచ్చే ఏర్పాట్లు భారీఎత్తున చేసారు. అంతేకాకుండా గోశాల సందర్శకులకి నవంబర్ 17న మధ్యాహ్నం ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
మరిన్ని వివరాలకు: Gaushala USA, by Shraddha Saburi Samidha, 7945 Deadfall Road, Arlington, Tennessee 38002. Phone: 1(682)800-cows or (682)800-2697 Email: gaushalausa@gmail.comWebsite: www.gaushalausa.org
Dr. Ramana Vasili
Spiritual Foundation
7062 S. Beringer Drive,
Cordova, Tennessee 38018
901-387-9646 or ramanavvasili@hotmail.com
www.spiritualfoundation.us













