బిల్ గేట్స్ ఫౌండేషన్ భారీ విరాళం
కరోనా వైరస్‌పై పోరాటానికి బిల్ అండ్ మెలిండాగేట్స్ ఫౌండేషన్ మరోసారి భారీ విరాళం ప్రకటించింది. తాజాగా 150 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,150 కోట్లు) ఇవ్వనున్నట్లు పేర్కొంది. దీంతో ఇప్పటివరకూ ఈ సంస్థ 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,919 కోట్లు) కరోనా నియంత్రణకు కేటాయించినట్టయింది. కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణ, చికిత్సలు, వ్యాక్సిన్ల తయారీ విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరించాలి. పేద, మధ్య ఆదాయ దేశల్లో కొవిడ్-19పై విజయం సాధించేందుకు ఈ నిధులను వినియోగించాలి అని ప్రపంచ నేతలను గేట్స్ ఫౌండేషన్ కో-చైర్పర్సన్ మెలిండా గేట్స్ కోరారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకనట విడుదల చేశారు. తాజా నిధులను దక్షిణాసియా, ఆఫ్రికాల్లో వెచ్చించనున్నట్టు అందులో పేర్కొన్నారు.













