గురు పూర్ణిమలో గజ్జపూజోత్సవం!
గురు పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని మెంఫిస్ పట్టణంలోని ఇండియన్ బాలే థియేటర్ అనే భారతీయ సంగీత నృత్య కళాశాల గత ఆరు నెలలుగా కూచిపూడి నృత్య శిక్షణ పొందుతున్న అమృత ఆరాధ్యులు, వేద వర్షిణి వడ్లమూడి, సాత్విక సెంథిల్ కుమార్ మరియు నందిని కొండిశెట్టి విద్యార్థుల గజ్జ పూజ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వించింది. కూచిపూడి నృత్య గురువులు శ్రీమతి చంద్ర ప్రభ మరియు డాక్టర్ రమణ వాసిలి చిన్నారులకి నూతన మువ్వలని అందించారు. సీనియర్ విద్యార్థులైనా నిధి నిహారిక చెన్నం మరియు శాన్వి కుంటమల్ల, ఇషిక సూరజ్ తో కలసి కూచిపూడి నృత్యాల్ని ప్రదర్శించారు.
అమృత, వేద, శాన్వి మరియు సాత్విక కూచిపూడి ప్రాధమిక అడుగులు, జతులు ప్రదరించారు. స్పిరిట్యుయల్ ఫౌండేషన్ వారి ఇండియన్ బాలే థియేటర్ గురు పూర్ణిమ విశేష దినాన్ని కాళీర్వీల్లె పట్టణం చర్చి అఫ్ ది హోలీ అపోస్టల్స్ లో జులై 27 సాయంత్రం 6 నుండి 10 వరకు బంధు మిత్ర సమేతంగా నిర్వహించారు. ఇండియన్ బాలే థియేటర్ ప్రతి గురు మరియు శుక్ర వారాల్లో హోలీ అపోస్టల్స్ చర్చి లో కూచిపూడి నృత్య శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది.
గత మూడు సంవత్సరాలుగా నృత్యాన్ని అభ్యసిస్తున్న బాలే థియేటర్ చిన్నారులు సెయింట్ లూయిస్ పట్టణంలో జరిగిన తానా మరియు చికాగో పట్టణం లో జరిగిన నాట్స్ ఉత్సవాల్లో అలాగే డల్లాస్ పట్టణం లో ఇటీవల ముగిసిన ఆటా మరియు టాటా ఉత్సవాల్లో నృత్యప్రదర్శనలు చేసినట్లు ఫౌండేషన్ కార్యదర్శి శ్రీమతి ఇందిరా ప్రియదర్శని చెన్నం చెప్పారు. తల్లిదండ్రులు మరియు కళాభిమానులు గురుపూర్ణిమ సందర్బంగా కూచిపూడి నాట్య గురువులు శ్రీమతి చంద్ర ప్రభ మరియు డాక్టర్ రమణ వాసిలిని ఘనంగా సన్మానించారు.
Dr. Ramana Vasili
Director: Spiritual Foundation, Inc.
901-387-9646 or
ramanavvasili@hotmail.com













