అమెరికా వైఖరిని తప్పుపట్టిన జి7 దేశాలు
కరోనా పై పోరులో ప్రపంచ దేశాలకు సహకరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు నిధులు నిలిపివేయాలన్న నిర్ణయాన్ని జి7 దేశాల నేతలు తప్పు పట్టారు. కరోనాను పూర్తిగా నిర్మూలించి ఆర్థిక రికవరీకి చేపట్టాల్సిన చర్యలపై జి7 దేశాలు గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించినట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ విషయంలో జి7 దేశాలలో ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదని జర్మన్ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ వ్యాఖ్యానించారని జర్మనీ మరో ప్రకటనలో పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓకు నిధులు నిలిపివేయాలన్న నిర్ణయంపై ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారని జర్మనీ వెల్లడించింది.













