NATS: నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఆన్లైన్ యోగా వర్క్‌షాప్
హైదరాబాద్: నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) ఆన్లైన్లో ఉచిత యోగా వర్క్‌షాప్‌ను నిర్వహిస్తోంది. తెలుగు భాష సంరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న NATS, ప్రవాస భారతీయులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ వర్క్‌షాప్‌కు బీవీవీ సుధీర్ కుమార్ (B V V Sudheer Kumar) సర్టిఫైడ్ ఇన్‌స్ట్రక్టర్‌గా వ్యవహరిస్తారు. ఆయన ఎం.ఎస్సీ. యోగా థెరపీ అండ్ సైన్సెస్, విశుద్ధి యోగా స్టూడియో ఫౌండర్లలో ఒకరు.
ముఖ్య వివరాలు:
వేదిక: ఆన్లైన్ (జూమ్).
సమయం: ప్రతి ఆదివారం ఉదయం 9 AM EST / 8 AM CST / 6 AM PST.
శిక్షణ అంశాలు: సూక్ష్మ వ్యాయామం, ఆసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్, యోగ నిద్ర.
లక్ష్యం: శరీరంలో ఫ్లెక్సిబిలిటీ, శక్తి , సమతుల్యత పెంపొందించడం.
రిజిస్ట్రేషన్: వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి www.natsworld.org/nats-yoga ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఈ ఉచిత వర్క్‌షాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని NATS చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, NATS ప్రెసిడెంట్ శ్రీహరి కోరారు. మరింత సమాచారం కోసం ఈవెంట్ కమిటీ సభ్యులను లేదా NATS హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.
Vishal.B






