TTA: తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం!
హన్మకొండ: తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో టీటీఏ సేవా డేస్-2025 కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 8వ తేదీ నుండి డిసెంబర్ 22వ తేదీ వరకు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సేవా డేస్‌లో ముఖ్యంగా మహిళల కోసం ఉచిత ఆరోగ్య శిబిరం, దివ్యాంగుల పిల్లల కార్యక్రమం ఏర్పాటు చేశారు.
తేదీ: సోమవారం, డిసెంబర్ 15వ, 2025
సమయం: ఉదయం 9:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు
వేదిక: మల్లికంబా మనోవికాస కేంద్రం (Mallikamba Manovikasa Kendram), శ్రీనివాస నగర్, హనుమకొండ 506001, తెలంగాణ.
ఈ కార్యక్రమాన్ని జ్యోతి రెడ్డి దూదిపాల స్పాన్సర్ చేస్తున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని, కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా టీటీఏ కోరుతోంది. మరింత సమాచారం కోసం వారి వెబ్సైట్ mytelanganaus.org ను లేదా TTA హెల్ప్‌లైన్: 1-866-TTA-SEVA ను సంప్రదించవచ్చు.






