అనాథను దత్తత తీసుకున్న ఫ్రాన్స్ దంపతులు
ఆ పాప పేరు మడారి పుష్ప. అనకాపల్లికి చెందిన ఈ బాలిక తల్లిదండ్రులు మూడేళ్ల కిందట చనిపోవడంతో అనాథ అయింది. బిక్షాటనకు దిగింది. స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో జనరేషన్ యువ ప్రతినిధుల హోమ్‌లో ఉంచారు. ప్రస్తుతం చిన్నారికి ఎనిమిదేళ్ల వయసు వచ్చింది. కేంద్ర దత్తత వనరుల సంస్థ (కారా) వెబ్సైట్లో చిన్నారి వివరాలు చూసి ఫ్రాన్స్‌కు చెందిన లీజూయాన్ అలైన్, డెలాన్ ఇసాబెల్లీ దంపతులు తద్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. కారా నిబంధనల మేరకు దత్తత ప్రక్రియను పూర్తి చేయడంతో జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ సమక్షంలో పుష్పను వారికి అప్పగించారు.













