హార్వీ బాధితులకు మాజీ అధ్యక్షుల చేయూత
అమెరికాలోని టెక్సాస్, టూసియానా రాష్ట్రాలకు కుదిపేసిన హరికేన్ హార్వీ వల్ల నిరాశ్రయులైన ప్రజలకు చేయూతనందించేందుకు ఆ దేశానికి చెందిన అయిదుగురు మాజీ అధ్యక్షులు రంగంలోకి దిగారు. జార్జి హెచ్డబ్ల్యు బుష్ (సీనియర్), ఒరాక్ ఒబామా, జార్జి డబ్ల్యు బుష్, బిల్‌క్లింటన్, జిమ్మీ కార్టర్లు హరికేన్ బాధితులకు సహాయపడేందుకు విరివిగా విరాళాలివ్వాలని అమెరికా ప్రజలకు వీడియో సందేశంలో పిలుపునిచ్చారు. విరాళాల సేకరణకు సీనియర్ బుష్ పేరుతో ఒక బ్యాంకు ఖాతాను తెరిచారు. వీరి ప్రయత్నం పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్లో హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు ఎంతటి కష్టం వచ్చినా మనమంతా ఒక్కటై ఎదుర్కోగలమని ట్రంప్ పేర్కొన్నారు.













