ఉద్యోగులకు పిజ్జాలు తెచ్చి ఇచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ తన ఔదార్యాన్ని చాటారు. జీతాలు లేకుండా పనిచేస్తున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ఆయన పిజ్జాలు తెచ్చి ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. మొత్తం ఆరు మంది సీక్రెట్ ఏజెంట్లు ప్రస్తుతం బుష్ వద్ద పనిచేస్తున్నారు. వారందరికీ ఆయన పిజ్జాలు తెచ్చి ఇచ్చారు. తాను, తన భార్య లారా కూడా ఏజెంట్లకు రుణపడి ఉన్నట్లు ఆయన తెలిపారు.
వాస్తవానికి గత 27 రోజులుగా అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా మూతపడింది. ద్రవ్య బిల్లుకు అనుమతి దక్కకపోవడం వల్ల సుమారు 8 లక్షల మంది జీతాలు లేకుండా పని చేస్తున్నారు. అందులో ఆరు లక్షల మంది సీక్రెట్ సర్వీస్ ఉద్యోగులు ఉన్నారు. వీలైనంత త్వరగా ప్రతిష్టంభన తొలగించాలని జార్జి బుష్ ప్రభుత్వాన్ని కోరారు. బోర్డర్వాల్కు నిధులు కేటాయిస్తేనే బిల్లుకు ఓకే చెబుతామని ట్రంప్ మొండికేసిన విషయం తెలిసిందే.













