థన్‌బర్గ్‌ను కలవడం ఆనందం కలిగించింది : ఒబామా
స్వీడన్‌కు చెందిన 16 ఏండ్ల గ్రేటా థన్‌బర్గ్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామాను కలిశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె కొంతకాలంగా ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఒబామా తనను కలిసిన థన్‌బర్గ్‌ను ట్విట్టర్ వేదికగా అభినందించారు. అంత చిన్న వయసులో పర్యావరణ పరిరక్షణ గురించి థన్‌బర్గ్ పోరాడడం గొప్ప విషయమని, ఆమెను కలవడం ఆనందంగా కలిగించిందని ఒబామా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒబామా థన్‌బర్గ్‌ను కలిసిన వీడియోను ఒబామా ఫౌండేషన్ విడుదల చేసింది. మీరు, నేను ఒక టీంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణకు పిడికిళ్లు బిగిద్దామని ఒబామా పేర్కొన్నారు.













