అమెరికాలో సంచలనం..
అమెరికాలో ట్యాక్సీ డ్రైవరుగా స్థిరపడిన భారత క్రీడాకారుడు తన తల్లిని, భార్యను హత్య చేశాడు. అనంతరం కుమారుడికి, కుమార్తెకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. పోలీసులకు సమాచారమివ్వాలని వారిని కోరాడు. తర్వాత కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి అతడిని అరెస్టు చేశారు. పెన్సెల్వేనియాలోని డెలవా కంట్రీ న్యూటౌన్ టౌన్షిప్లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 1983లో కువైట్‌లో జరిగిన ఏషియన్ అథ్తెటిక్స్లో ఇక్బాల్ సింగ్ (ప్రస్తుత వయసు 62 ఏళ్లు) షాట్‌పుట్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. తర్వాత అమెరికా వలస వెళ్లి, అక్కడే ట్యాక్సీ డ్రైవరుగా స్థిరపడ్డారు. ఆదివారం తన తల్లి నసీబ్ కౌర్‌ను, భార్య జస్పాల్ కౌర్‌ను హత్యచేశాడు. ఇక్బాల్‌కు ఎలాంటి నేర చరిత్రలేదని, ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదని డెలవాకంట్రీ న్యాయాధికారి చెప్పారు.













